: నిరాశపరిచిన కోహ్లీ... మూడు వికెట్లు డౌన్
మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలుతోంది. కేవలం 65 పరుగులకే మూడు వికెట్లు పతనమయ్యాయి. ఫిలాండర్ బౌలింగ్ లో ధావన్ డకౌట్ కాగా, 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్గర్ బౌలింగ్ లో పుజారా లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. నాలుగు బంతులను ఎదుర్కొన్న కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి రబాడ బౌలింగ్ లో ఎల్గర్ కు సిల్లీ పాయింట్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు ఓపెనర్ మురళీ విజయ్ 36 పరుగులతో క్రీజులో ఉండగా, రహానే 2 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు.