: వీడిన గ్రేటెస్ట్ ఆర్కియాలజీ మిస్టరీ... జరూసలేంలో బయటపడ్డ 2 వేల ఏళ్ల నాటి గ్రీకు కోట


ప్రపంచ చరిత్రలో గ్రేటెస్ట్ ఆర్కియాలజీ మిస్టరీల్లో ఒకటిగా నిలిచిన ఇజ్రాయిల్ ప్రాంతంలో గ్రీకుల కోట తొలిసారిగా బయల్పడింది. పురాతత్వ పరిశోధకులు క్రీస్తుపూర్వం 168లో ధ్వంసమైన 'హీ' నగరాన్ని కనుగొన్నారు. ఈ కోటకు 'ఆక్రా' అని పేరుండేదట. క్రీస్తు పుట్టక ముందు ఆంటియోచస్ ఎపిఫానిస్-4 ఆక్రాను పాలించాడని, ఆనాటి నగర ఆనవాళ్లు ఇప్పుడు బయల్పడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఆ కోట గడలను ప్రసిద్ధ 'టెంపుల్ మౌంట్' ప్రాంతంలో కనుగొన్నామని ఇజ్రాయిల్ ఆంటిక్యుటీస్ అధారిటీ డైరెక్టర్ దొరాన్ బెన్ అమీ వివరించారు. ఈ గోడలు ఎంతో బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. తదుపరి కాలంలో ఆక్రాను మెర్సినరీస్, జ్యూస్ లు ఆక్రమించారని వివరించారు. త్వరలో ఈ కోటకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని, ఆనాటి గ్రీకుల చరిత్ర మరింతగా నేటి ప్రపంచానికి తెలియనుందని అన్నారు.

  • Loading...

More Telugu News