: ఆదివారం రాత్రి నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూటే సెపరేటు. తరచుగా తన ఫామ్ హౌస్ కు వెళుతూ, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నా... ఆయన మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తాజాగా ఆదివారం రాత్రి ఫామ్ హౌస్ కు చేరుకున్న ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మరో రెండు రోజుల పాటు కేసీఆర్ అక్కడే గడపనున్నారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కూడా ఎవరికీ దొరకడం లేదని తెలుస్తోంది. ఫోన్ల మీదనే కేసీఆర్ అన్ని విషయాలను చక్కబెడుతున్నారట. చండీయాగం ఏర్పాట్లపై కేసీఆర్ పూర్తిగా దృష్టి సారించారని... ఫామ్ హౌస్ అంతా కలియదిరుగుతూ యాగం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.