: నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్
హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి సంబంధించి వైద్య పరికరాల కొనుగోలు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ కొట్టిపారేశారు. అవి తనంటే గిట్టని వారు చేసిన ఆరోపణలని అన్నారు. అవన్నీ పూర్తిగా అవాస్తవమని, కమిటీ నిర్ణయం తీసుకున్నాకే పరికరాలు కొనుగోలు చేశామని చెప్పారు. నాటి ప్రభుత్వం ఒత్తిడి మేరకు కొనుగోలు చేశామని తెలిపారు. అయితే ఏసీబీ అధికారుల దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని ధర్మరక్షక్ చెప్పారు. మరోవైపు అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.