: ఉదయాన్నే పతనం మొదలు... ధావన్ డక్కౌట్
మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ డక్కౌటయ్యాడు. ఫిలాండర్ బౌలింగ్ లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చిన ధావన్ తొలి వికెట్ రూపంలో పెవీలియన్ చేరగా, ఒన్ డౌన్ లో ఛటేశ్వర్ పుజారా వచ్చి మరో ఓపెనర్ మురళీ విజయ్ కి జతగా చేరాడు. వీరిద్దరూ కలసి కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత స్కోరు 13 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు. పుజారా 13, విజయ్ 25 పరుగులు చేశారు.