: కెనడా 'రక్షణ' బాధ్యత భారత సంతతి వ్యక్తి చేతుల్లోకి


కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడావు క్యాబినెట్లో 30 మందికి స్థానం లభించగా, రక్షణ మంత్రిగా పనిచేసే అవకాశం భారత సంతతి వ్యక్తి హర్జీత్ సజ్జన్ (42)కు లభించింది. గతంలో కెనడా సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేసి ఆపై, దక్షిణ వాంకోవర్ నియోజకవర్గం నుంచి హర్జీత్ విజయం సాధించారు. బోస్నియా, కాందహార్, ఆఫ్గనిస్థాన్ తదితర దేశాల్లో సహాయార్థం వెళ్లిన కెనడా సైన్యంలోనూ పనిచేశారు. ఇండియాలో పుట్టిన హర్జీత్ ఐదేళ్ల వయసులో ఉండగానే, తల్లిదండ్రులతో కలసి కెనడాకు వలస వెళ్లారు. భవిష్యత్తులో కెనడా యుద్ధ శక్తిని మరింతగా పెంచడమే తన ముందున్న లక్ష్యమని, ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొనేలా సైన్యాన్ని తయారు చేస్తామని ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా హర్జీత్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News