: రోజుకు ఆరు గంటలు నిలబడండి...ఊబకాయానికి చెక్ చెప్పండి!
మీ శరీరం ఉండాల్సిన బరువుకన్నా అధిక బరువుందని భావిస్తున్నారా? భవిష్యత్తులో ఊబకాయం వస్తుందేమోనన్న భయంగా ఉందా? ఏ మాత్రం ఖర్చు కాకుండా ఈ భయానికి దూరమయ్యే అవకాశం ఉంది. రోజుకు ఆరు గంటలు నిలబడితే చాలట. యూఎస్ లోని హ్యూస్టన్ కేంద్రంగా నడుస్తున్న అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన పరిశోధకుల బృందం ఈ విషయాన్ని తెలిపింది. వీరు చేసిన అధ్యయనం ప్రకారం, ఎక్కువ సమయం కూర్చున్న వారితో పోలిస్తే, వీలైనంత సేపు నిలబడడం, అటూ ఇటూ తిరుగుతూ ఉన్న వారిలో ఊబకాయం అతి తక్కువగా కనిపించిందని పరిశోధకులు వివరించారు. తమ సర్వేలో 7 వేల మందిని భాగం చేశామని తెలిపారు. వీరు చేసిన పరిశోధన వివరాలతో మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.