: చోటా రాజన్ తరలింపు మరోసారి వాయిదా... ఇంకా తెరచుకోని బాలి ఎయిర్ పోర్టు
మాఫియా డాన్ చోటా రాజన్ ను భారత్ తీసుకువచ్చేందుకు ఇండోనేసియా నగరం బాలికి వెళ్లిన సీబీఐ అధికారులతో పాటు ముంబై పోలీసులు అక్కడే చిక్కుబడిపోయారు. అగ్నిపర్వతం విస్ఫోటనం నేపథ్యంలో బాలిలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మూత పడింది. ఈ నేపథ్యంలో అప్పటికే చోటా రాజన్ తరలింపునకు చేసిన ఏర్పాట్లన్నింటినీ భారత అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది. అగ్ని పర్వతం విస్పోటనం నేపథ్యంలో రేపు కూడా బాలి ఎయిర్ పోర్టులో కార్యకలాపాలను అక్కడి అధికారులు రద్దు చేశారు. రేపటి పరిస్థితిని పరిశీలించిన తర్వాత కాని బాలి ఎయిర్ పోర్టు తెరచుకునే పరిస్థితి లేదు. దీంతో చోటా రాజన్ తరలింపు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం లేకపోలేదు.