: బీహార్ బరి నేటితో సరి!... మరికాసేపట్లో తుది దశ పోలింగ్
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు నేటితో ముగియనుంది. మొత్తం ఐదు దశల పోలింగ్ లో భాగంగా మరికాసేపట్లో తుది దశ అయిన ఐదో దశ పోలింగ్ మొదలు కానుంది. మొత్తం 9 జిల్లాల పరిధిలోని 57 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో 827 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నేడు పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో విజయం సాధించే పార్టీలే దాదాపు ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టనున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలోనే నిన్నటిదాకా అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తించాయి.