: వారణాసిలో బీజేపీ కార్పొరేటర్ హత్య


వారణాసిలో భారతీయ జనతా పార్టీకి చెందిన రామాపూర్ కార్పొరేటర్ శివసేథ్(40) హత్యకు గురయ్యారు. తులసిపూర్ ప్రాంతంలో మోటార్ సైకిల్ పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు శివసేథ్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. శివసేథ్ తమ ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ సంఘటన జరిగింది. అయితే, శివసేథ్ పై దుండగులు వెనుక నుంచి కాల్చారు. ఆసుపత్రికి తరలించేటప్పటికే అతను ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఈ సంఘటన చోటుచేసుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News