: రానాను నవ్వించిన అల్లు శిరీష్


టాలీవుడ్ యువనటుల్లో దగ్గుబాటి రానాది ప్రత్యేకశైలి. టాలీవుడ్ లో తన సమకాలీనుల్లో అందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగివుంటాడు. తాత, తండ్రి, బాబాయ్ లోని లక్షణాలను పుణికిపుచ్చుకున్న రానా అందర్నీ కలుపుకునిపోతాడు. వారివారి పుట్టిన రోజులు, సినిమా విడుదలప్పుడు వారిని అభినందిస్తూ ప్రోత్సహిస్తాడు. అలాంటి రానా బాహుబలి ఆడియో వేడుక సందర్భంగా రాజమౌళితో సంభాషిస్తున్న ఓ ఫోటోను ట్వీట్ చేసి, దానికి సరైన వ్యాఖ్య రాయాలని అభిమానులను కోరాడు. దీనికి స్పందించిన అల్లు శిరీష్..."రానా! బాహుబలిలో భల్లాలదేవ పాత్ర కోసం జిమ్ లో కష్టపడి మనిషివి బాగా రాటుదేలిపోయావు...కాస్త అప్పుడప్పుడు పువ్వుల్ని...అమ్మాయిల్ని చూడు...అంటూ రాజమౌళి చెబుతున్నాడంటూ' కామెంట్ పెట్టాడు. కాగా, అల్లు శిరీష్ రాసిన వ్యాఖ్య అతని సోదరుడు అల్లు అర్జున్ 'జులాయి' సినిమాలో డైలాగ్ కావడం విశేషం. దీనికి రానా బిగ్గరగా నవ్వుతున్నట్టు ట్వీట్ సమాధానమిచ్చాడు. వీరి ట్వీట్స్ అభిమానులను అలరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News