: ‘ఫోర్బ్స్’ శక్తిమంతుల జాబితాలో మోదీ ముందుకెళ్లారు


‘ఫోర్బ్స్’ ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. మోదీ తర్వాత భారత్ నుంచి రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 36 స్థానంలో ఉండగా భారత సంతతికి చెందిన లక్ష్మీ మిట్టల్ 55, సత్య నాదెళ్ల 61 స్థానంలో నిలిచారు. మొత్తం 73 మందితో కూడిన ప్రపంచ శక్తిమంతుల జాబితా-2015ను ఫోర్బ్స్ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దక్కించుకున్నారు. రెండో స్థానాన్ని జర్మనీ వైస్ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్, మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నాలుగో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. కాగా, ఫోర్బ్స్ గత ఏడాది జాబితాలో మోదీ 15వ స్థానంలో నిలిచారు. దీంతో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో మోదీ ముందుకెళ్లారు. ‘ఫోర్బ్స్’ మొదటి పది మంది శక్తిమంతులు వీరే.... 1. వ్లాదిమిర్ పుతిన్ 2. యాంజెలా మెర్కెల్ 3. బరాక్ ఒబామా 4. పోప్ ఫ్రాన్సిస్ 5. జి జిన్ పింగ్ 6. బిల్ గేట్స్ 7. జానెట్ ఎల్లెన్ 8. డేవిడ్ కామెరాన్ 9. నరేంద్ర మోదీ 10. లారీ పేజ్

  • Loading...

More Telugu News