: జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్ల జాబితా పున:పరిశీలించాలి: ఈసీ ఆదేశాలు


కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పున:పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు అందాయి. బీసీ ఓటర్ల గుర్తింపుతో పాటు ఓట్ల తొలగింపు ఫిర్యాదులను పున:పరిశీలించాలని, ఓటర్ల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించాలని, ఈ నెల 18వ తేదీ లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, గ్రేటర్ లోని 24 నియోజకవర్గాల్లో మొత్తం 6,25,700 ఓట్లను తొలగించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల అధికారుల బృందం తనిఖీ, పరిశీలనలు చేపట్టింది. తెలంగాణ సర్కార్ తనకు అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగిస్తోందంటూ పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News