: నటి మూన్ మూన్ సేన్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం : తృణమూల్ కాంగ్రెస్


ప్రధాని నరేంద్ర మోదీపై నటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మూన్ మూన్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తి గతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి డెరిక్ ఓ బ్రియన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. మోదీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కేవలం ఆమె వ్యక్తిగతమన్నారు. బంకురా ఎంపీ అయిన మూన్ మూన్ సేన్ నిన్న ఒక ఛానల్ తో మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేము మోదీకి అవకాశమిచ్చాము. అందుకు తగ్గట్లుగానే ఆయన ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ప్రధాని కూడా అయ్యారు. కానీ, మోదీ సొంత పార్టీ మాత్రం ఆయనకు అవకాశమివ్వడం లేదు. ఐదేళ్లలో ఆయన ఏమి చేస్తారో చూద్దాం. ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా వెళదాం’ అంటూ మూన్ మూన్ సేన్ మీడియాతో మాట్లాడిన విషయం విదితమే. దీంతో పలు విమర్శలు తలెత్తాయి.

  • Loading...

More Telugu News