: రెండు జట్ల వివరాలను రేపు ప్రకటిస్తాం!: సచిన్


బాస్కెట్ బాల్, బేస్ బాల్, ఫుట్ బాల్, రగ్బీలకు విశేషమైన ఆదరణ లభించే అమెరికాకు క్రికెట్ ను పరిచయం చేసే ఉద్దేశ్యంతో సచిన్, వార్న్ న్యూయార్క్ లో 'ఆల్ స్టార్స్ టీట్వంటీ సిరీస్' నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో పాలుపంచుకునే జట్ల సభ్యుల బృందాన్ని రేపు ప్రకటిస్తానని సచిన్ చెప్పాడు. న్యూయార్క్ లోని సిటీ ఫీల్డ్ పార్క్ లో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ సిరీస్ పై ఇప్పటికే సచిన్, వార్న్ ప్రచారం ప్రారంభించారు. ఆల్ స్టార్స్ టీట్వంటీ సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సచిన్ బ్లాస్టర్స్ తో షేన్స్ వారియర్స్ తలపడతారని సచిన్ ట్వీట్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్ లలో గంగూలీ, సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, కుంబ్లే, జయవర్థనే, సంగక్కర, జయసూర్య, లారా, ఆంబ్రోస్, సెహ్వాగ్, హేడెన్, మెక్ గ్రాత్, బ్రెట్ లీ, జాంటీ రోడ్స్, స్మిత్, నాసిర్ హుస్సేన్, పీటర్సన్, వసీం అక్రమ్, వకార్ యూనస్ వంటి దిగ్గజ క్రికెటర్లు పాలుపంచుకోనున్నారు.

  • Loading...

More Telugu News