: పబ్లిసిటీ వస్తుందంటే బాబు ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుంది: వైఎస్ జగన్
పబ్లిసిటీ వస్తుందనుకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఖర్చయినా చేస్తుందని, పేద రైతును మాత్రం పట్టించుకోదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శించారు. కడప జిల్లా పులివెందుల మండలం మోపట్నూతలపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. రాజశేఖర్ చనిపోయి 18 రోజులైనా ఒక్క అధికారి కూడా వాళ్లింటికి రాలేదని ఆయన అన్నారు. పులివెందుల రైతు కనుక అతని కుటుంబాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లాలో తాను 46 రైతు కుటుంబాలను పరామర్శించినట్లు చెప్పారు. అందులో 20 కుటుంబాలకు సాయం అందలేదని చెప్పారు.