: ఏపీ రేషన్ షాపుల్లో కందిపప్పు ధర పెరిగింది !
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ షాపుల ద్వారా విక్రయించే కందిపప్పు ధరను పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కిలో రూ.90 చొప్పున విక్రయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు కిలో కందిపప్పు రూ.50కు అమ్మిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కందిపప్పు ధరలు మార్కెట్ లో మోగిపోతుండటంతో, టాంజానియా కందిపప్పును రంగంలోకి దింపారు వ్యాపారులు. ఈ కందిపప్పును రూ.85 నుంచి రూ.90 మధ్యన వ్యాపారులు విక్రయించారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు టాంజానియా కందిపప్పుపై ఆసక్తి కనపర్చిన విషయం తెలిసిందే.