: రాజయ్య, అతని కుమారుడిపై ఎఫ్ఐఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అతని కుమారుడు అనిల్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవదహనమైన కేసులో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 498ఏ, 306, 174 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నామని, ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు. ,