: లిక్కర్ బాటిల్ తో స్టాలిన్ ముందు నిరసన తెలిపిన యువతి


డీఎంకే నేత స్టాలిన్ ముందు ఓ యువతి లిక్కర్ బాటిల్ తో నిరసన తెలిపి సంచలనం సృష్టించింది. తమిళనాడులోని వేలూరులో 'నమక్కునామె' అనే ప్రచార కార్యక్రమంలో స్టాలిన్ పాల్గొన్నారు. వేదికకు సమీపంలో ఆ యువతి కన్నీరు కారుస్తూ, చేతిలో లిక్కర్ బాటిల్ ఊపుతూ స్టాలిన్ కంటపడింది. దీంతో స్టాలిన్ ఆమెను వేదికపైకి పిలిచి సమస్య ఏంటని అడిగారు. దీంతో తన తండ్రి మద్యానికి బానిసై మృతిచెందారని, రాజకీయ పార్టీలు ఎన్ని వచ్చినా మద్యనిషేధం విధించడం లేదని, తద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈసారి అధికారం చేపడితే మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇవ్వాలని ఆమె స్టాలిన్ ను కోరింది. దీంతో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మద్యనిషేధం ఉందని ఆయన చెప్పారు. ఈసారి తాము అధికారం చేపడితే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News