: ఆయుష్షు కోసం... ఇవి తప్పకుండా పాటించాల్సిందే!
ఆయుష్షు కోసం ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంత త్వరగా చేసుకుంటే అంతమంచిది. తద్వారా మన జీవితాకాలాన్ని పొడిగించుకోవచ్చు. అందుకోసం వైద్య నిపుణులు చేసిన సూచనలు... ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించుకోవాలి. ఆ పని చేయడం ద్వారా లివర్ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గుతుంది, చక్కటి నిద్ర పడుతుంది. రోజుకు కనీసం 20 నిమిషాల పాటు నడిస్తే గుండె నొప్పి వంటివి దరిచేరవు. ఒత్తిడి వంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది... గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం ద్వారా లంగ్ కేన్సర్, గుండెనొప్పి వంటి వాటిని దరిచేరనీయకుండా ఉంచచ్చు. మన ఆహారంలో తీసుకునే షుగర్ శాతాన్ని తగ్గించుకోవడం ద్వారా చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.