: పిచ్ తో పనిలేదు...గేమ్ ప్లాన్ ఉంది: కోహ్లీ
పిచ్ తో పని లేదని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మొహాలీలో ఆయన మాట్లాడుతూ, సౌతాఫ్రికాను ఓడించే గేమ్ ప్లాన్ తమ వద్ద ఉందని అన్నాడు. వ్యూహానికి కట్టుబడి ఆటగాళ్లంతా ప్రదర్శన చేస్తే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పాడు. పిచ్ ఎలాంటిదైనా దానిని అర్థం చేసుకుని, ప్రాథమిక అంశాలకు కట్టుబడి ఆడితే రాణించగలమని తెలిపాడు. సఫారీ ఆటగాళ్లు ఫాంలో ఉన్నారన్న కోహ్లీ, వారిని పెవిలియన్ బాటపట్టించే సామర్థ్యం టీమిండియా బౌలర్ల సొంతమని విశ్వాసం వ్యక్తం చేశాడు. క్రీజులో కుదురుకుని భారీ ఇన్నింగ్స్ ఆడడమే తమ కర్తవ్యమని కోహ్లీ తెలిపాడు.