: బీహార్ ఎన్నికల్లో విజయం రాజ్యసభలో మా బలాన్ని పెంచుతుంది: వెంకయ్యనాయుడు
బీహార్ లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండింటిలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందని బీహార్ ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజ్యసభలో ఎన్డీయే కూటమి బలం పెరుగుతుందని తెలిపారు. మత అసహనం అంటూ కొంతమంది తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం పట్ల తనకు వ్యతిరేకత లేదని అన్నారు. అయితే గతంలో హింస చెలరేగినప్పుడు సైలెంట్ గా ఉన్నవారు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని అన్నారు.