: దేశంలో ఎలాంటి సంక్షోభ వాతావరణం లేదు: వెంకయ్యనాయుడు
దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ పలువురి నుంచి వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. అసలు దేశంలో ఎలాంటి సంక్షోభ వాతావరణం లేదని అన్నారు. దేశంలో కొన్ని అవాంఛిత పరిణామాలు చోటుచేసుకున్నాయని, వాటితో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వెంకయ్య విమర్శించారు. ఢిల్లీలో ఓ బిజినెస్ ఛానల్ తో ఆయన ఈ విధంగా మాట్లాడారు. పలువురు రచయితలు, సాహితీవేత్తలు పురస్కారాలను వెనక్కివ్వడంపై వెంకయ్య స్పందించారు. ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో హింస చెలరేగితే మౌనంగా ఉన్న వారు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.