: చెన్నై- బ్యాంకాక్ మధ్య త్వరలో స్పైస్ జెట్ విమాన సర్వీసు


చెన్నై- బ్యాంకాక్ మధ్య డైరెక్టు విమాన సర్వీసును డిసెంబర్ 10న ప్రారంభించనున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజుల పాటు 'టు వే' ఫెయిర్ రూ.9,999 ఉంటుందన్నారు. కొత్త విమాన సర్వీసు వారంలో ఆరుసార్లు అందుబాటులో ఉంటుందన్నారు. స్పైస్ జెట్ నుంచి రెండవ అంతర్జాతీయ విమాన సర్వీసుగా దీనిని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పైస్ జెట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ శిల్పా భాటియా మాట్లాడుతూ, తమ సంస్థ నుంచి మొట్టమొదటి అంతర్జాతీయ విమాన సర్వీసు గత ఏడాదిలో కోల్ కతా నుంచి బ్యాంకాక్ కు ప్రారంభమైందన్నారు. తమ సంస్థ నుంచి బ్యాంకాక్ కు రెండో సర్వీసును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని భాటియా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News