: అవును...ఐటెం సాంగ్ లో నటిస్తున్నా: అంజలి


అవును, నిజమే! అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నానని సినీ నటి అంజలి నిర్ధారించింది. హీరోయిన్ గా రాణిస్తున్న అంజలి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ సరసన ఐటెం సాంగ్ లో ఆడిపాడనుందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిని ఆమె ధ్రువీకరించింది. తమన్ సంగీతం సమకూర్చిన ఫాస్ట్ బీట్ కు అల్లు అర్జున్ తో కలిసి నర్తించనున్నానని అంజలి తన ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొంది. కాగా, ప్రస్తుతం అంజలి, బాలకృష్ణతో డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News