: షారుక్ ఖాన్ కు బీజేపీ నేత క్షమాపణలు
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గియ క్షమాపణలు చెప్పారు. 'అమితాబ్ బచ్చన్ తరువాత పాప్యులర్ నటుడు ఆయనే' అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. షారుక్ పై తన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని, ఎవరినీ బాధించాలన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు విజయవర్గియ ట్వీట్ చేశారు. దేశంలో తీవ్ర అసహనం నెలకొందంటూ షారుఖ్ ఖాన్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనపై విరుచుకుపడిన వర్గియా... షారుక్ మనసంతా పాక్ లోనే ఉందని, ఆయన దేశద్రోహి అనీ విమర్శించిన విషయమూ తెలిసిందే.