: ఆయనా...చంద్రబాబును విమర్శించేది?: కన్నాపై టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించే హక్కు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు లేదని టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ స్నేహబంధం కన్నా లక్ష్మీనారాయణకు నచ్చడం లేదని, అందుకే ఆ స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం పది నెలలపాటు చేతిలో అధికారం లేకుండా ఉండలేకపోయిన ఆయనకు ముఖ్యమంత్రిని విమర్శించే హక్కులేదని ఆయన హితవు పలికారు. పదేళ్లు మంత్రిగా ఉన్న కన్నాకు కాపు సామాజిక వర్గం సమస్యలు కనపడలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు అకస్మాత్తుగా కాపులపై ప్రేమ కురిపిస్తున్నారని ఆయన విమర్శించారు.