: నా ఆత్మబంధువు కొండవలసను కోల్పోవడం చాలా బాధాకరం: నటశిక్షకుడు సత్యానంద్
ప్రముఖ హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు మరణవార్త తనను ఎంతో బాధించిందని నట శిక్షకుడు, స్టార్ మేకర్ ఎల్.సత్యానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. కొండవలస తనకు ఆత్మబంధువని చెప్పారు. నాటకరంగంలో ఆయనతో కలసి ఎన్నో ఏళ్లు ప్రయాణం చేశానని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. 'యుగ సంధ్య' అనే నాటకంలో కొర్లలయ్య పాత్రను కొండవలస పోషిస్తే, తాను బాలనటుడిగా రాముడి పాత్ర పోషించానని చెప్పారు. విశాఖ పోర్టులో కొండవలస పనిచేస్తున్నప్పుడు ఆయనతో కలసి 20కి పైగా నాటికలను ప్రదర్శించామని తెలిపారు. దారి తప్పిన ఆకలి, తూర్పు లేఖలు, యుగ సంధ్య, టామీ టామీ, సారాంశం, నిజం, స్వార్థం బలి తీసుకుంది వంటి ప్రాచుర్యం పొందిన నాటకాల్లో తాము నటించామని చెప్పారు. కొండవలస మృతికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.