: ఆర్కిటెక్ట్ అద్భుత ఆవిష్కరణ ...బాల్కనీ లేదని ఇక బాధపడక్కర్లేదు!
అడవులు అంతరించిపోయి...కాంక్రీట్ జంగిల్ లు అవతరించాయి. దీంతో అద్భుతమైన సూర్యోదయాన్ని, చక్కని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించే వెసులుబాటు లేకుండా పోయింది. పట్టణాల్లో ఇరుకిరుకు అపార్టుమెంట్లు జీవితానికి ప్రకృతిని మరింత దూరం చేశాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయి వారు నిర్మించుకునే బహుళ అంతస్తుల భవనాల్లో బాల్కనీలు ఉంటాయి. అదే ఓ స్థాయి వారు నిర్మించుకునే అపార్ట్ మెంట్లలో బాల్కనీలు ఉండవు. బాల్కనీలో కుర్చీలో కూర్చుని ఆకాశాన్ని చూస్తే కలిగే ఆ మజాయే వేరు! ఇలాంటి అభిరుచిని సాకారం చేసేందుకు ఆల్డనా ఫెర్రర్ గార్షియా అనే అర్జెంటినా ఆర్కిటెక్ట్ ఓ బాల్కనీ కిటికీని రూపొందించాడు. ఈ కిటికీ బాల్కనీలో ఒక మనిషి దర్జాగా కాళ్లు చాపుకుని కూర్చుని ఆకాశంలోని అందాలను ఆస్వాదించవచ్చు. బాల్కనీ లేని ఇళ్లకు ఇలాంటి కిటికీ ఓ మంచి బాల్కనీలా ఉపయోగపడుతుంది.