: ఈ నెలలోనే మళ్లీ మార్కెట్లోకి ‘మ్యాగీ’
ఇటీవల నిషేధానికి గురైన మ్యాగీ నూడిల్స్ తిరిగి మార్కెట్లోకి రానుంది. ఈ నెలలోనే మార్కెట్లోకి మ్యాగి కొత్త సరుకు వస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. కొత్తగా తయారు చేసిన మ్యాగీ ఉత్పత్తులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ లలో నిర్వహించిన పరీక్షల్లో క్లీన్ చిట్ లభించిందన్నారు. కర్నాటకలోని నంజన్ గడ్, పంజాబ్ లోని మోగా, గోవాలోని బిచోలిమిలలో ఉన్న మ్యాగీ ప్లాంట్లలో కొత్త సరుకును తయారు చేశామన్నారు. ఎన్ఏబీ గుర్తింపు పొందిన ల్యాబ్ లలో కొత్తగా తయారు చేసిన మ్యాగీ న్యూడిల్స్ కి నిర్వహించిన పరీక్షలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదన్నారు. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా తయారు చేసిన మ్యాగీ న్యూడిల్స్ కి ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మ్యాగీ నూడిల్స్ మసాలా ఉత్పత్తులను ఈ నెలలోపే తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తామని, ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతామని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.