: చప్పట్లు కొట్టలేదని కచేరి ఆపేసిన యువ పాప్ సంచలనం


సంచలనాలకు కేంద్ర బిందువు అయిన యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి వింతగా ప్రవర్తించి వార్తల్లోకి ఎక్కాడు. తాను పాట పాడుతున్నప్పుడు బీట్ కు తగ్గట్టుగా ప్రేక్షకులు చప్పట్లు కొట్టలేదనే కారణంతో... మ్యూజిక్ కన్సర్ట్ ను మధ్యలోనే ఆపి వెళ్లిపోయాడు. దీంతో కచేరీకి హాజరైన ప్రేక్షకులు నివ్వెరపోయారు. స్పెయిన్ లో జరిగిన కన్సర్ట్ లో 'వాట్ డూ యూ మీన్' అనే పాట పాడుతూ, బీట్ కు అనుగుణంగా చప్పట్లు కొట్టమని ప్రేక్షకులను రెండు మూడు సార్లు ఉత్సాహపరిచాడు. అయినా ప్రేక్షకులు బీట్ కు అనుగుణంగా చప్పట్లు కొట్టకపోవడంతో... పాటను ఆపేసి వేదిక దిగి వెళ్లిపోయాడు.

  • Loading...

More Telugu News