: కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదనను చంద్రబాబు విరమించుకోవాలి: టీడీపీ ఎమ్మెల్యే


కాపులను బీసీల్లో చేర్చే అంశంపై టీడీపీ ప్రభుత్వం ఓ వైపు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఆ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని ఓ టీడీపీ ఎమ్యెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఆయనే హైదరాబాద్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని... లేకపోతే, బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కులాలకు రిజర్వేషన్లు ఇవ్వరాదని... ఈ అంశాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకోరాదని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ వేస్తున్నట్టు చంద్రబాబు అన్నారని... ఈ నిర్ణయంతో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. కాపులను బీసీల్లో చేరిస్తే... బీసీల పార్టీగా ఉన్న టీడీపీకి నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News