: తెలుగు రాష్ట్రాలకు నేను తండ్రిలాంటి వాడిని... రెండు రాష్ట్రాలూ నాకు సమానమే: గవర్నర్ నరసింహన్


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న తాను రెండు తెలుగు రాష్ట్రాలకు తండ్రిలాంటివాడినేని ప్రకటించారు. రెండు రాష్ట్రాలూ తనకు సమానమేనన్నారు. ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుల మధ్య సయోధ్య కుదర్చడంలో తాను సఫలీకృతుడనయ్యానని నరసింహన్ పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు కలవడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు ఇద్దరు సీఎంలు సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇద్దరు సీఎంలకు ఇది కీలక సమయమని, శాంతచిత్తంతో వ్యవహరించాలని గవర్నర్ సూచించారు.

  • Loading...

More Telugu News