: ఠాణాలో యువజంటను చితకబాదిన ముంబై పోలీసులు... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్


ముంబై పోలీసులు మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఏదో చిన్న ఆరోపణపై స్టేషన్ కు పిలిపించిన యువజంటపై పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో మగ పోలీసులే కాక మహిళా పోలీసులు కూడా పాలుపంచుకున్నారు. స్టేషన్ లోని లాకప్ గదిలో కాకుండా అధికారులు కూర్చుండే టేబుళ్ల వద్దే జరిగిన ఈ దాడిని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ నెల 1న రాత్రి సమయంలో సన్నిహితంగా మెలగిన సదరు యువజంట కొద్దిసేపటికే కీచులాడుకున్నారట. ఈ ఆరోపణలపైనే వారిని స్టేషన్ కు పిలిచిన అంధేరీ పోలీసులు స్టేషన్ లోనే చితకబాదారు. దాడి సందర్భంగా యువజంటలోని యువతి విచిడిపెట్టమని అర్థించినా పోలీసులు కనికరం చూపలేదు. మహిళా పోలీసులు ఆమెపై విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News