: హరిరామ జోగయ్యపై క్రిమినల్ కేసులు పెట్టాలి!: కళా వెంకట్రావ్


మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త హరిరామ జోగయ్య ఓ వివాదాస్పద వ్యక్తని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలతో నింపిన పుస్తకాలతో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవాకులు చెవాకులు పేలకుండా ప్రభుత్వం ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీలో మంత్రి పదవి ఇవ్వలేదనే పార్టీపై జోగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రంగా హత్యకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, కాపులకు అధిక ప్రాధాన్యమిస్తున్నది టీడీపీయేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News