: ఏపీకి ప్రత్యేక హోదాపై హామీలను మోదీ విస్మరిస్తున్నారు: జైరాం రమేశ్
ఏపీ కాంగ్రెస్ నేతలు నిర్వహించబోయే మట్టి సత్యాగ్రహానికి ఆశీస్సులివ్వాలంటూ ఢిల్లీలో రాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైరాం మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై హామీలను ప్రధాని మోదీ విస్మరిస్తున్నారని ఆరోపించారు. చట్టంలో పేర్కొనకపోయినా ఉత్తరాఖండ్ కు హోదా ఇచ్చారని గుర్తు చేశారు. ఉప్పు సత్యాగ్రహం స్పూర్తితో మట్టి సత్యాగ్రహం నిర్వహించ తలపెట్టామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలో హామీలను సాధించేందుకు ఈ మట్టి సత్యాగ్రహం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ నెల 6న నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశంలో విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.