: బీహార్లో బీజేపీ ఓడిపోవడం దేశానికి అత్యంత ముఖ్యం: కేజ్రీవాల్
ప్రజాస్వామ్య భారతదేశంలో విద్వేష రాజకీయాలు పనికి రావని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం అత్యంత ప్రధానమని తెలిపారు. అప్పుడే బీజేపీకి విద్వేష రాజకీయాలు పనికి రావన్న విషయం అర్థమవుతుందని అన్నారు. భారతీయులు ప్రేమను, శాంతి సామరస్యాలను కోరుకుంటారని... విద్వేష రాజకీయాలను కాదని చెప్పారు. బీహార్ ప్రజలు జేడీయూకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, రేపటితో బీహార్ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.