: కోర్టు ఆవరణలోనే భార్యను నరికాడు


కోర్టు ఆవరణలోనే అందరూ చూస్తుండగా కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికేశాడు ఓ భర్త. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సత్యనారాయణ రాజు (42), వసుంధర (38)లకు పదేహేనేళ్ల క్రితం పెళ్లయింది. గత ఏడేళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తపై వసుంధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసును పాలకొల్లు కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో, ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సిందిగా రాజుకు సమన్లు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు రాజు కోర్టుకు హాజరయ్యాడు. తన భార్య న్యాయస్థానంలోకి ప్రవేశిస్తున్న సమయంలో, తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో ఆమెను నరికాడు. దాంతో, వసుంధర ఒక్కసారిగా కుప్పకూలింది. చుట్టుపక్కల ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు. అనంతరం సత్యనారాయణ రాజు అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వసుంధరను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పరారైన సత్యనారాయణ రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News