: గ్యాస్ లీకేజీ వల్లే అగ్ని ప్రమాదం జరిగింది: వరంగల్ సీపీ సుధీర్ బాబు
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలోని కోడలు సారిక బెడ్ రూమ్ లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. గ్యాస్ లీకేజీ తో మంటలు చెలరేగి కోడలు సారిక, ముగ్గురు పిల్లలు పూర్తిగా కాలిపోయారని చెప్పారు. అయితే గ్యాస్ ఎలా లీకైందన్న విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదన్నారు. ప్రస్తుతం ప్రత్యేక క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉందన్నారు. అంతేగాక సాంకేతికంగా కూడా దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.