: పాకిస్థాన్ కు వచ్చేయ్... షారూక్ ఖాన్ కు స్వాగతం పలికిన కరుడుగట్టిన ఉగ్రవాది


ఇండియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడు షారూక్ ఖాన్ పై కొందరు రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేసిన వేళ, కరుడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది, ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ నుంచి మద్దతు లభించింది. "క్రీడలు, కళలు, విద్య తదితరాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న భారత ముస్లింలు తమ గుర్తింపు కోసం నిత్యమూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షారూక్ సహా ఎవరైనా ముస్లిం, ఇస్లాం కారణంగా ఇండియాలో కష్టంగా ఉందని భావిస్తే, వారు పాకిస్థాన్ కు వచ్చి నివాసం ఏర్పరచుకోవాలని స్వాగతిస్తున్నాం" అని ట్వీట్ పెట్టాడు. షారూక్ ను దేశద్రోహి అని, పాకిస్థాన్ ఏజంటని బీజేపీ నేతలు కొందరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News