: శోకసంద్రంలో రాజయ్య... ఇంటి ఆవరణలో కుప్పకూలిన వైనం


వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిరిసిల్ల రాజయ్య శోకసంద్రంలో కూరుకుపోయారు. తన ఇంటిలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో కోడలు సారిక సహా ముగ్గురు మనవలు అభినవ్, ఆయోన్, శ్రీయోన్ సజీవ దహనమైన నేపథ్యంలో ఇంటి ఆవరణలోనే రాజయ్య కుప్పకూలిపోయారు. పంచె, బనియన్లపైనే పై అంతస్తు నుంచి కిందకు వచ్చిన రాజయ్య అక్కడే కుప్పకూలిపోయారు. అంతేకాక దారుణంపై ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజయ్య కుమారుడు, సారిక భర్త అనిల్ కూడా షాక్ కు గురయ్యారు. ఘటనతో దిగ్భ్రాంతికి గురైన పార్టీ నేతలు హుటాహుటిన రాజయ్య ఇంటికి చేరుకుని ఆయనను ఓదార్చే యత్నం చేస్తున్నారు. మరోవైపు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News