: ఎయిరిండియా బంపర్ ఆఫర్ ...1777 రూపాయలకే విమానయానం
చౌక ధరల బంపర్ ఆఫర్ ను ఎయిరిండియా ప్రకటించింది. దేశీయ ప్రయాణాలపై చౌక ధరల పథకాన్ని ఎయిరిండియా నేడు ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ విమానయానం ధరలు 1777 రూపాయలకే ప్రారంభమవుతాయని ఎయిరిండియా తెలిపింది. నవంబర్ 3 నుంచి 7 వరకు ఈ ఆఫర్ పై టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 2016 జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిరిండియా స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కు ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.