: ఆ విజయం సాధిస్తే నా కల నెరవేరుతుంది: సానియా మీర్జా


‘2016 రియో ఒలింపిక్స్ లో విజయం సాధించాలన్నది నా చిరకాల వాంఛ. ఆ పతకం నా సొంతమైతే నా కల నెరవేరినట్లే’ అని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేర్కొంది. ముంబయిలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న అనంతరం సానియా విలేకరులతో మాట్లాడింది. ఒకవేళ రియో ఒలింపిక్స్ లో విజయం సాధించకపోయినా కొనసాగుతానని ఆమె చెప్పింది. కాగా, ఈ ఏడాది వరుస విజయాలతో సానియా దూసుకుపోతోంది. సానియా- హింగిస్ జోడీ ఈ ఏడాది పలు టైటిళ్లను గెలుచుకుంది. తాజాగా డబ్ల్యుటీఏ టైటిల్ ను ఈ జంట గెలుచుకున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News