: దీపావళికి పలుమార్గాల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు


దీపావళి పండగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దీపావళి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు... 4వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి- సికింద్రాబాద్ సూపర్ ఫాస్టు రైలు 7వ తేదీ రాత్రి 7.15 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి సూపర్ ఫాస్టు రైలు 5వ తేదీ రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్-కాకినాడ 6వ తేదీ రాత్రి 7.30 గంటలకు కాకినాడ టౌన్- సికింద్రాబాద్ 5వ తేదీ సాయంత్రం 4.35 గంటలకు కాకినాడపోర్టు- సికింద్రాబాద్ 6వ తేదీ రాత్రి 7.15 గంటలకు సికింద్రాబాద్-కాకినాడ పోర్టు 7వ తేదీ రాత్రి 9.05 గంటలకు కాకినాడ పోర్టు- తిరుపతికి ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి.

  • Loading...

More Telugu News