: రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మీర్జా భర్త


అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్ జట్టుకు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్, ఆఫ్ స్పిన్నర్ గా సేవలందించిన షోయబ్ మాలిక్ ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇంగ్లండ్ లో మూడో టెస్టు ఆడుతున్న షోయబ్ ఈ టెస్టు ముగియడంతో తన అంతర్జాతీయ టెస్టు కెరీర్ ముగిసినట్టేనని తెలిపాడు. ప్రతిభావంతులైన యువకులు జట్టులోకి వస్తున్నారని, వారిని ప్రోత్సహించేందుకు ఇదే సరైన సమయం అని భావించానని, తాను రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించానని అందుకే రిటైర్ అవుతున్నానని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తన పూర్తి ప్రాధాన్యత కుటుంబానికేనని, అలాగే 2019 లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నానని షోయబ్ మాలిక్ పేర్కొన్నాడు. కాగా, షోయబ్ మాలిక్ భార్య భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News