: తప్పిపోయిన బాలలను తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్న సల్లూ భాయ్!
ఇటీవల 'భజరంగీ భాయ్ జాన్'గా అభిమానులను అలరించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిజజీవితంలో కూడా 'సల్లూ భాయ్ జాన్' అనడంలో అతిశయోక్తి లేదు. సల్మాన్ నడుపుతున్న 'బీయింగ్ హ్యూమన్' సంస్థ కూడా తప్పిపోయిన బాలబాలికలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడంలో విశేషమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు 30 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు ఈ ఫౌండేషన్ చేర్చింది. అయితే, ఈ సేవలు చేస్తున్నది సల్మాన్ అన్న సంగతి మాత్రం ఈ ఫౌండేషన్ లో చేరిన బాలలకు తెలియదట. గతంలో ఓసారి సల్మాన్ తమ సంరక్షణ చూస్తున్నాడని తెలిసిన బాలబాలికలు, సంరక్షణ కేంద్రం వదిలి వెళ్లేందుకు ససేమిరా అంగీకరించేవారు కాదట. అందుకే, ఫౌండేషన్ నుంచి తల్లిదండ్రుల చెంతకు చేరే ముందు మాత్రమే ఆయా పిల్లలను కలుస్తాడట. పాకిస్థాన్ నుంచి వచ్చిన గీత తన తల్లిదండ్రులను చేరిన తరువాత ఆమెను కలుస్తానని సల్లూభాయ్ చెప్పాడు.