: రోజుకో పోస్టుతో భారత్ పర్యటనను గుర్తు చేసుకుంటున్న ఫేస్ బుక్ అధినేత
ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ ఇటీవల భారత్ లో పర్యటించి తిరిగి కాలిఫోర్నియా వెళ్లిపోయారు. వెళ్లిన నాటి నుంచి ఆయన రోజుకో పోస్టుతో భారత్ ను గుర్తుచేసుకుంటున్నారు. 'గేట్ వే ఆఫ్ ఇండియా' దగ్గర తాను నడుస్తున్న ఫోటోను నిన్న పోస్టు చేసిన జుకెర్ బర్గ్, తాజాగా తాజ్ మహల్ వద్ద నడుస్తున్న ఫోటోను పోస్టు చేశారు. ఈ సందర్భంగా మరోసారి ఈ ప్రదేశాలను సందర్శించాలని ఉందనే కోరికను ఆయన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు ఆయనను అభిమానించే వారిని ఆకట్టుకుంటున్నాయి.