: వచ్చే నెలలో ఐఫా సినీ అవార్డుల ప్రదానం


వచ్చే నెలలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఫా నిర్వాహకులు తెలిపారు. ఐఫా కార్యక్రమాల నిర్వహణపై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ సినీనటులు కమలహాసన్, నాగార్జున, వెంకటేశ్, తమన్నా, నిర్మాత సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఐఫా ఉత్సవాలను డిసెంబర్ 4 వ తేదీ నుంచి 6 వరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

  • Loading...

More Telugu News