: సోషల్ మీడియాలో నెటిజన్లను అలరిస్తున్న ఖాన్ ద్వయం ఫోటో
సామాజిక మాధ్యమంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, బాలీవుడ్ మాస్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లు కలిసి తీసుకున్న ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. షారూఖ్ ఖాన్ 50వ పుట్టిన రోజును పురస్కరించుకుని, సల్మాన్ శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా సల్లూ భాయ్ తన తాజా చిత్ర విశేషాలు షారూఖ్ కు వివరిస్తూ, రెజ్లింగ్ లో రెండు చిట్కాలు చెప్పాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ తీసుకున్న ఫోటోను షారూఖ్ పోస్టు చేస్తూ, పుట్టిన రోజును పురస్కరించుకుని 'భాయ్ రెజ్లింగ్ లో రెండు చిట్కాలు నేర్పాడు' అంటూ పేర్కొన్నాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా, నిన్న మొన్నటి వరకు షారూఖ్, సల్మాన్ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. వీరి కలయిక ఇద్దరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.