: చైనా పెళ్లి వేడుక సంప్రదాయంలో అపశ్రుతి... వధువు తలకు బలమైన గాయం


చైనాలో జరిగే పెళ్లి వేడుకలలో ఓ సంప్రదాయం ఉంది. పెళ్లికి ముందు వరుడు వధువును గాల్లోకి ఎగరేసి పట్టుకోవాలి. దానికోసం బంధువులంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అయితే అక్కడి జావోజుయాంగ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఓ వివాహంలో ఆ సంప్రదాయానికి వరుడు ప్రయత్నించగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఎప్పటిలానే అందంగా ముస్తాబైన వధువు వరుడు వద్దకు వచ్చింది. బంధువులంతా ఎదురు చూస్తుండగా వారి సంప్రదాయం ప్రకారం వరుడు వధువును గాల్లోకి ఎగరేశాడు. కానీ తిరిగి పట్టుకోలేకపోయాడు. దాంతో వధువు కాస్తా కిందపడిపోయింది. ఆమె తల నేలకు బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఇరువురి కుటుంబ సభ్యులు వధువును ఆసుపత్రికి తరలించారు. అయితే తలకు బలమైన గాయమవడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో ఆమె కోలుకుంటుందని తెలిపారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News